మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లక్ష్యాన్ని నీరు కార్చొద్దు అన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని తెలిపారు.
Minister Seethakka : అధికారులంతా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేయండని ఆమె వ్యాఖ్యానించారు. మీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోండని, నిబద్ధతతో పనిచేసి శాఖ గౌరవాన్ని నిలబెట్టాలన్నారు. శాఖకు వన్నె తెచ్చేలా పనిచేయాలని ఆమె సూచించారు. శాఖపరంగా వాస్తవాలనే నివేదించండని, మా మెప్పుకోసం వాస్తవాలను దాచి పెట్టొద్దన్నారు. అధికారులు, అమాత్యులు వేరు వేరు కాదని, మీరు పొరపాట్లు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేయొద్దన్నారు మంత్రి…
Minister Seethakka : కొమురం భీం జిల్లాలోని కెరమెరి మండలంలోని జంగుబాయి జాతర ఘనంగా జరుగుతున్నది. ఈ జాతరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి సీతక్క గిరిజన సంప్రదాయ చీరకట్టులో పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన మహిళలు గోలుసు, కడియాలు, చీరకట్టులో పాల్గొని తమ సంప్రదాయాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. మంత్రితోపాటు, ఎమ్మెల్యే కొవ్వ లక్ష్మి కూడా ఆదివాసీ సంప్రదాయ వేషధారణలో జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, మంత్రి సీతక్క జంగుబాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులైన కటోడాలను సన్మానించారు.…
Post Office Scheme: తెలివైన పెట్టుబడి మంచి రాబడులను తెచ్చిపెడుతుంది. అయితే ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడి పెడితే లాభాలు అందుకోవచ్చు. కానీ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లాభాల సంగతి దేవుడెరుగు.. ఉన్నది ఊడ్చుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి భద్రతో కూడిన ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ప్రభుత్వ స్కీమ్స్ విషయానికి వస్తే.. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ను…
Minister Seethakka: పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గ్రామీణ అభివృద్ధి, పల్లెల్లో పారిశుధ్యం, ప్రజల సంక్షేమంపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మన దేశం గ్రామాలతో ముడిపడిందని, అందుకే గ్రామాలను ప్రగతి పథంలో నిలపాల్సిన బాధ్యత డిపిఓలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేయాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రగతికి స్థానిక పరిస్థితులను బట్టి…
Nimmala Rama Naidu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని 6 గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్, మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ. 6 కోట్ల 86 లక్షల నిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం విడుదల చేసిన 832 కోట్ల రూపాయల నిధులు, దళారీ…
విజన్-2047 పేరిట చంద్రబాబు మరో మారు పబ్లిసిటీ స్టంట్‌కు దిగారని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదన్నారు.
ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు అని, సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Ponguleti Srinivas Reddy : నిర్మల్ జిల్లా భైంసాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల కనుసైగల్లో వారి స్వార్థం కోసం నిస్వార్థంతో పనిచేసే ఉద్యోగులను భయభ్రాంతలకు గురిచేశారని మండిపడ్డారు. వారి ఫోన్లో ఏమాట్లాడారో చూసామని, భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. కలెక్టర్‌ను చంపాలని రెచ్చగొట్టారని ఆయన ఆరోపించారు. పింక్ కలర్ అసలు నాయకుల పాత్ర ఉందో దాన్నంతా ప్రభుత్వం ఎక్స్ రే…