టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెబుతున్న పాలకులు.. మరో 50 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు.. అయితే, ఈ తరుణంలో సర్కార్ కొలువులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… నాగర్‌కర్నూల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న అందరికీ సర్కారు నౌకరి రాదని వ్యాఖ్యానించారు.. అంతేకాదు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ పని ఉపాధి కాదా..? అంటూ…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు సీఎం కేసీఆర్… నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ రూపొందించామన్నారు.. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి… దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణగా…