Raja Singh:గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో కూడా పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
డీజీపీ అంజనీ కుమార్ కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనకు 8 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని లేఖలో పేర్కొన్నారు రాజాసింగ్.. ఆ కాల్స్ ఎక్కడి నుంచో కాదు పాకిస్తాన్ నుండి వస్తున్నాయని లేఖలో తెలిపారు.