Raja Singh:గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గతంలో కూడా పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వీడియో బయటపెట్టారు. అంతే కాకుండా.. తనకు వస్తున్న కాల్ లిస్ట్ లను కూడా కలిగి ఉంది. తనకు ఈ నెంబర్లతోనే రోజూ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. శ్రీరామనవమి రోజున శోభయాత్ర తీయడాన్ని బెదిరిస్తున్నట్లు తెలిపారు. శోభయాత్ర తీస్తే కాల్చేస్తామని బెరిస్తున్నట్లు రాజాసింగ్ స్వయంగా ఫోన్ ద్వారా మీడియాకు చూపించారు. తనకు కాల్ చేసి బెదిరిస్తున్న కాలర్ కు తను బెదిరిస్తే బెరికం కాదని దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలని రాజాసింగ్ అన్నారు. నువ్వు ఒక అమ్మకు పుట్టి వుంటే నా ఎదురుగా వచ్చి మాట్లాడని ధైర్యం చెప్పారు. తనకు రోజూ కాల్స్ చేసి బెదిరించేది కాదు.. గుండె ధైర్యం మనిషివైతే ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించింది. నేను రాముడి శోభయాత్ర చేసే తీరుతానని చెప్పారు.
Read also: MLA Vasupalli Ganesh Kumar: వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..
తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటికైనా వెళతానని చెప్పిన రాజాసింగ్.. ఇలాంటి బెదిరింపులపై తన కేమీ చేయలేవని స్పష్టం చేశారు. నిజంగా దమ్ముంటే ముందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలని కోరారు. అయితే ఏ నెంబర్ల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పాడు. తనకు సుమారు 20 వరకు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. ఇదిలా ఉండగా జనవరి 22న అయోధ్యలో శ్రీరామప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయడంతో.. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్‌పై అప్పటి డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
MLA Vasupalli Ganesh Kumar: వివాదంలో వైసీపీ ఎమ్మెల్యే..! కళాశాలలో మద్యం, కోళ్లు పంపిణీ..