ఆఫ్రికాలో కనిపించే పెద్ద జంతువుల్లో ఏనుగులు కూడా ఒకటి. ఆఫ్రికా ఏనుగులను మచ్చిక చేసుకోవడం అంత సులభం కాదు. భారీ ఆకారంతో పెద్ద పెద్ద కోరలతో భయంకరంగా ఉంటాయి. ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో ఈ ఏనుగులు వ్యాపించి ఉన్నాయి. మోజాంబిక్ దేశంలోని గోరంగొసా జాతీయ పార్క్ లో పెద్దసంఖ్యలో ఏనుగులను సంరక్షిస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్క్‌లో పెద్ద పెద్ద దంతాలతో ఏనుగులు కనిపించేవి. అయితే, ఇప్పడుకనిపిస్తున్న ఏనుగులకు దంతాలు ఉండటం లేదు. దీనికి పెద్ద కారణమే…