BJP MLA: డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా శనివారం ప్రధాని నరేంద్రమోడీకి తన సొంత రక్తంతో లేఖ రాశారు. గూర్ఖాల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. గూర్ఖా సంఘం సమస్యలపై ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఏప్రిల్ 10, 2014న సిలిగురి సమీపంలో ఖప్రైల్‌లో జరిగిన బహిరంగ సభ్యలో ప్రధాని మోడీ ఇచ్చి హామీలు ఇప్పటికీ నెరవేరలేదని లేఖలో హైలెట్ చేశారు.