తెలుగుదేశం పార్టీలోనే కాదు. యావత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం.. కాక పుట్టిస్తోంది. ఆయన వినిపిస్తున్న ధిక్కార స్వరం.. టీడీపీలో ఉన్న లుకలుకలను బయటపెడుతోంది. “పెదబాబు పట్టించుకోవడం లేదు.. కనీసం చినబాబు అయినా పట్టించుకోకపోతే ఎలా” అని ఆయన ప్రశ్నిస్తున్న తీరు.. తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 2014లో టీడీపీ గెలవడానికి.. 2019లో ఓడిపోవడానికి దారి తీసిన కారణాలను సైతం.. తాజా పరిణామం చర్చలోకి తీసుకువస్తోంది. కొన్నాళ్ల క్రితమే..…
రాజమండ్రిలో గోరంట్ల నివాసానికి పార్టీ అధిష్టానం నుంచి త్రిసభ్య బృందం చేరుకుంది. అధిష్టానం బృందంలో విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీమంత్రులు చినరాజప్ప జవహార్ తదితరులు ఉన్నారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లను బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది టీడీపీ అధిష్టానం. రాజీనామా యోచన విషయంలో ఉన్న గోరంట్ల ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దాంతో గోరంట్ల నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అనుచరులు. బుచ్చయ్య డిమాండ్లు పరిశీలనలోకి తీసుకుని, ఆదిరెడ్డి అప్పారావుతో…
గోరంట్ల బుచ్చయ్య చౌదరి బెదిరించారా? బ్లాక్‌మెయిల్ చేశారా? అవమానాలకు, అప్రాధాన్యతలకు అలక బూనారా? అధిష్ఠానం మెడలు వంచడానికి రాజీనామా డ్రామా ఆడారా? లేక నిజంగానే బైబై చెప్పేయాలని నిర్ణయించుకున్నారా? ఇది టీకప్పులో తుఫానా? ఉప్పెన అవుతుందా? బుచ్చయ్యకు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వలేదా? టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీలో అలజడి రేపారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీలో చిన్న అన్నగా గుర్తింపు పొందిన ఆయన చంద్రబాబుకంటే టీడీపీలో సీనియర్. అయినప్పటికీ పదవుల…
జగన్ చెడ్డీ గ్యాంగ్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు అని అన్నారు టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కేంద్రంగా రెండు వేల 500 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని అన్నారు. దానికి సిబిఐ దర్యాప్తు అవసరం. పర్యావరణ హితం కాకుండా, మైనింగ్ పర్మిషన్ లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఎస్ఇబి దాడులు ఏవి ప్రశ్నించారు. ఇసుకకు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ప్రభుత్వ…