Rabies: ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోని ఒక గ్రామంలో ‘‘రేబిస్’’ కలకలం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవల, రేబిస్ సోకిన ఒక ఆవు పాలతో ‘పంచామృతం’ ప్రసాదాన్ని చేశారు. ఆవు పచ్చిపాలతో దీనిని తయారు చేయడంతో ఇప్పుడు దీనిని సేవించిన గ్రామస్తులు భయం గుప్పిట్లో చిక్కుకున్నారు.