అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాలనగర్ లో ప్రేమ వ్యవహారం, పసి పాపకు శాపంగా మారింది. గోపాల నగర్ లో నివాసం ఉంటున్న ప్రదీప్, అదే ప్రాంతానికి చెందిన యువతి స్వాతి ప్రేమ పేరుతో తరచూ వేధించేవాడు. పలు మార్లు యువతి బంధువులు హెచ్చరించారు. ప్రదీప్ తన శైలి లో మార్పు రాకపోగా.. స్వాతికి, పువ్వులు పంపడంతో స్వాతి బాబాయ్ వివేక్‌నంద ఆగ్రహానికి గురయ్యారు.