Google: గూగుల్‌పై లా సూట్.. రూ.41 వేల కోట్ల పరిహారం చెల్లింపుకు సిద్ధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ కంపెనీ గూగుల్‌కు బిగ్ షాక్ తగిలింది. ‘ఇన్‌కాగ్నిటో (Incognito)’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఓ కంపెనీ గూగుల్‌కు వ్యతిరేకంగా ‘క్లాస్ యాక్షన్ లా సూట్’ దాఖలు చేసింది. ఈ కేసు కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి య్వోన్నె గొనాలెజ్ రోజర్స్ ధర్మాసనం విచారించింది. అయితే మొదట ఈ కేసును కొట్టివేయాల్సిందిగా గూగుల్ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో పిటిషనర్‌తో రాజీ ఒప్పందం కుదుర్చుకునేందుకు గూగుల్ ముందుకు వచ్చింది.
Also Read: MEA on Qatar: న్యాయబృందంతో చర్చిస్తాం.. ఖతార్ అంశంపై ప్రభుత్వ తొలి స్పందన ఇదే..
Also Read
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
గూగుల్ అభ్యర్థన విన్న జడ్జి ఒప్పందం కుదిరే వరకు విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సదరు పిటిషనర్‌కు రూ.41 వేల కోట్లు (500 కోట్ల డాలర్లు) చెల్లించేందుకు గూగుల్ సిద్ధమైనట్టు సమాచారం. పిటిషనర్, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి పూర్తి స్పష్టత లేకున్న న్యాయవాదులు తమ రాజీ ఒప్పందానికి కట్టుబడి ఉంటామన్నారు. దీంతో రాజీ ఒప్పందానికి గడువు ఇస్తూ తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 24కు కోర్టు వాయిదా వేసింది. పటిషినర్‌కు ఎలాంటి అభ్యంతరం లేకుండ ఉంటే ఈ ఒప్పందాన్ని అమోదిస్తామని కోర్టు పేర్కొన్నట్టు తెలుస్తోంది.
కాగా ‘ఇన్‌కాగ్నిటో’ మోడ్‌లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్ తన గూగుల్ అనలిటిక్స్, కుకీస్, యాప్స్ ద్వారా ట్రాక్ చేస్తున్నదని సదరు కంపెనీ తన పటిషన్‌లో ఆరోపించింది. అయితే దీనిపై గూగుల్ స్పందిస్తూ.. అసలు ‘ఇన్‌కాగ్నిటో మోడ్ అంటేనే ప్రైవేట్‌గా బ్రౌజింగ్ చేసే పద్దతి, దానిని తీసువచ్చిందే గూగుల్.. ఈ మోడ్‌లో ఇంటర్నేట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీ ‘బ్రౌజింగ్ హిస్టరీ’ని కుకీస్ ట్రాక్ చేయడం కుదరని గూగుల్ వివరణ ఇచ్చుకుంది. కానీ, పిటిషన్ దాఖలు చేసిన సంస్థ మాత్రం ఇన్‌కాగ్నిటో బ్రౌజ్ చేసిన స్నేహితులు, హాబీలు, ఫేవరెట్ ఫుడ్, షాపింగ్ హాబిట్స్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ దొంగిలిస్తుందని పటిషినర్ నొక్కి చెప్పారు.
Also Read: Drugs Caught: న్యూ ఇయర్ వేళ.. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రోజర్స్ గూగుల్‌పై మండిపడ్డారు. ప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ చేస్తున్న యూజర్ల డేటాను సేకరించబోమని తాము చేప్పిన వాగ్ధానానికి గూగుల్ కట్టుబడి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు. 2016 జూన్ ఒకటో తేదీ నుంచి లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ దొంగలించినట్టు 2020లో సదరు సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇది కాలిఫోర్నియా వ్యక్తిగత గోప్యత చట్టాలను ఉల్లంఘించడమేనని, యూజర్లకు 5000 డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆ పిటిషన్‌లో డిమాండ్ చేసింది.
తాజావార్తలు
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!