ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్‌లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్‌కాస్ట్ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్‌కాస్ట్‌ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్‌కాస్ట్‌ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నారని.. అది "Google TV స్ట్రీమర్"గా చెబుతున్నారు.