Freedom App: రైతులు, చిన్న వ్యాపారులు తమ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడానికి దోహదపడుతున్న ఫ్రీడమ్ యాప్ కోటి డౌన్‌లోడ్‌లను దాటింది. ప్రారంభించిన 33 నెలల వ్యవధిలోనే ప్రజాధరణ పొందింది. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మళయాళం వంటి స్థానిక భాషల్లో కూడా కంటెంటు రూపొందించడంతో ప్రజలకు చేరువైంది. ప్రస్తుతం వ్యవసాయం, వ్యాపారం రంగాల్లో 960 కోర్సులను కలిగి ఉంది.
ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందులో ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియా యాప్స్‌తో పాటు మరికొన్ని యాప్స్… ఆ యాప్స్ ఇస్టాల్ చేసే సమయంలో.. వారు పెట్టే కండీషన్స్‌కు అన్నింటికీ ఒకే.. ఒకే కొట్టేయడమే.. ఇదే పెద్ద సమస్యగా మారుతుంది.. కొన్ని యాప్స్ ఫోన్‌ను గుల్ల చేస్తుంటే.. మరికొన్ని యాప్స్.. సదరు వినియోగదారుల సమాచారాన్ని మొత్తం లాగేస్తుంది.. అసలుకే ఎసరు పెట్టేవరకు వెళ్తోంది పరిస్థితి.. ఈ నేపథ్యంలో.. ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించి సమస్యలు ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌ను…
ఒకప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం… ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే…
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో లక్షల కొలది యాప్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే.. ప్రజలకు ఉపయోగకరంగా లేని, ఆప్డేట్‌లో లేని యాప్‌లను తొలగించేందుకు గూగుల్, యాపిల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి అప్డేట్ చేయని యాప్‌లను అప్డేట్ చేయాలంటూ సంబంధిత సంస్థలకు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లు ఇప్పటికీ సూచించాయి. అయితే.. ఈ క్రమంలో.. గూగుల్ ప్లే స్టోర్‌లో దాదాపు 8.69లక్షల ఆండ్రాయిడ్, యాపిల్…
గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్ సరికొత్త రికార్డ్‌ను సొంతం చేసుంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్‌లో 10 బిలియన్ల ఇన్‌స్టాల్‌గా యాప్‌గా రికార్డ్ సాధించింది. 10 బిలియన్ల ఇన్‌స్టాన్‌లు సాధించిన నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌లు ఈ రికార్టును సాధించగా, నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది. జీమెయిల్‌ను 2004లో వాడుకలోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్‌బిల్డ్‌గా జీమెయిల్‌ను కొన్ని స్మార్ట్‌ఫొన్లు అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగ దారులకు అనుగుణంగా…
గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రతిరోజూ కొన్ని వందల కొత్త యాప్‌లు రిజిస్టర్ అవుతుంటాయి. అందులో కొన్ని యాప్‌లు వినియోగించుకోవడానికి, డైలీ లైఫ్ లో వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కొన్ని యాప్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, కొన్ని యాప్‌లు సరదాగా గేమ్‌లు వంటివి ఆడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ప్రతీ ఏడాది గూగుల్ ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్స్ ఏమున్నాయి అనే దానిపై సర్వేను నిర్వహిస్తుంది. యూజర్ సర్వే ఆధారంగా బెస్ట్ యాప్స్ ఏంటో ప్రకటించి వాటికి అవార్డులు అందజేస్తుంటుంది. 2021 యూజర్…