Google Play Store Key Decision on APP Installation.
రోజు రోజుకు టెక్నాలజీ ఎంత పెరుగుతుందో.. మోసాలు కూడా అంతేలా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మానవ జీవితంలో మొబైల్ తప్పనిసరిగా అయిపోయింది. ఇంకా.. డిజిటల్ చెల్లింపుల వాడకం పెరుగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ వాడక తప్పడం లేదు. ఎక్కడ చూసిన యూపీఐ లావాదేవీలే ఎక్కువ. అయితే.. ఇవే కాకుండా ఎన్నో కొత్త కొత్త యాప్‌లు ప్లే స్టేర్‌లోకి రంగప్రవేశం చేసి డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని యాప్స్ వ్యక్తిగత సమాచారాన్ని దోపిడి చేసే యాప్స్ ఉండగా వాటికి చెక్ పెట్టేందుకు ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇప్పటికే చాలా రోజుల నుంచి అప్డేట్ చేయని యాప్స్ వెంటనే అప్డేట్ చేయాలంటూ సంబంధిత సంస్థలకు ఉత్వర్వులు జారీ చేసిన ప్లే స్టోర్… అప్డేట్ గడువు ముగిసిన యాప్స్‌ను అప్డేట్ చేయని వాటిని తొలగిస్తోంది. అయితే ఇప్పుడు..యాప్స్ వినియోగించే సమయంలో దానికి అవసరమైన అనుమతులను ఇచ్చేస్తాం.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇలా చేయడం వల్ల యూజర్లకు సంబంధించిన విలువైన సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్తోందని వాదనలు వినిపిస్తున్న వేళ.. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్స్‌కు డేటా సేఫ్టీ పేరుతో గూగుల్ ప్లే స్టోర్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్ల డేటా భద్రతకు భరోసా కల్పించనుంది గూగుల్ ప్లే స్టోర్. కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం.. యూజర్లు యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే సమయంలో యాప్ డెవలపర్ ఎలాంటి డేటా సేకరిస్తున్నారు, దాన్ని ఎవరితోనైనా పంచుకుంటున్నారా? అనే సమాచారాన్ని తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది గూగుల్ ప్లే స్టోర్.