Special Story on Sundar Pichai: ఈ రోజుల్లో చాలా మంది తమకు తెలియని ఏ విషయాన్నైనా అడిగేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ముందుగా గూగుల్ తల్లినే ఆశ్రయిస్తున్నారు. ఆ తల్లినే కన్న కొడుకు సుందర్ పిచాయ్. ప్రపంచంలోని పవర్ ఫుల్ కంపెనీ గూగుల్‌కి సీఈఓ అయిన మొట్టమొదటి నల్లజాతీయుడు, భారతీయుడు ఈయనే కావటం మనకు గర్వకారణం. సెర్చింజన్లలో గూగుల్ ఒక దిగ్గజంగా ఎదిగేందుకు తోడ్పడిన టూల్‌బార్ రూపకల్పనలో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషించారు.