నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్”. దీపావళి సందర్భంగా నవంబర్ 4న ప్రీమియర్‌ను ప్రదర్శించడానికి ఆహా సిద్ధంగా ఉంది. మొదటి ఎపిసోడ్‌కు మంచు మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు అతిధులుగా హాజరుకానున్నారు. ఈ విషయాన్నీ ఇటీవల విడుదలైన ప్రోమోలో ప్రకటించారు. అయితే పేరుకు తగ్గట్టుగానే షో ఉన్నట్టుగా ప్రోమో చూస్తే అన్పించింది. ఏదో తూతూ మంత్రంగా నాలుగు మాటలతో సరిపెట్టేయకుండా వివాదాస్పద ప్రశ్నలను సైతం ఈ షోలో బాలయ్య ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. నవంబర్…