కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.. గుడివాడలో రోడ్లకు మరమ్మత్తులు చేయాలంటూ కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నించారు జనసేన పార్టీ శ్రేణులు.. దీంతో, జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.. ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకోవడంతో.. కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. ఇక, జనసేన నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. తామేం నేరం చేశామంటూ ఎదురు తిరిగారు జనసైనికులు.. దీంతో, భారీగా పోలీసులను మోహరించారు..…
ఏపీలో జనసేన పార్టీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతోంది. ఏపీలో రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. ఈనెల 15, 16, 17 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జనసేన చేపట్టనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు తెనాలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన డిజిటల్ క్యాంపెయిన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దారుణంగా ఉన్న రహదారులను కనీస మరమ్మతులు కూడా…