అమ్మ..! ఆ.. పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం, ఇంకా ఎన్నెన్నో.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ…