డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్.. అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించింది.