Siddaramaiah: హిందుత్వ సిద్ధాంతకర్తలు వినాయక్ దామోదర్ సావర్కర్, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంఎస్ గోల్వాల్కర్ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. గురువారం బెంగళూర్‌లోని కర్ణాటక కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ(కేపీసీసీ) కార్యాయలంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.