ఫాస్ట్‌ఫుడ్‌కు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. ఆర్డర్లు చేసుకొని మరీ లాగించేస్తుంటారు. ఈ ఫాస్ట్‌ఫుడ్‌లో వెరైటీలు కనిపిస్తే వెంటనే ఆర్డర్ చేసుకుంటుంటారు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్ వంటి వాటికి ఎప్పుడూ గిరాకీ అధికంగానే ఉంటుంది. బర్గర్‌లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒకటి ఈ గోల్డెన్ బర్గర్. పేరుకు తగినట్టుగానే దీన్ని బంగారంతో తయారు చేశారు. ఈ బర్గర్ తయారీలో ఖరీదైన కేవియన్, పెద్ద సముద్రపు పీత, కుంకుమపువ్వు, వాగ్యూ బీఫ్, పందిమాంసం, ఆరుదైన తెల్లని…