ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైసీపీ సర్కార్ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.. 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సాధారణ పరిపాల శాఖ