Priest Suicide: కాళీమాత తనకు దర్శనం ఇవ్వలేదని ఓ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. 24 గంటల పాటు ప్రార్థన నిర్వహించినా కాళీమాత తనకు కనిపించలేదని 45 ఏళ్ల పూజారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం గైఘాట్ పతంగలిలోని తన అద్దె నివాసంలో అమిత్ శర్మ గొంతు కోసుకున్నాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా అతను మరణించారు.
కాళీ దేవత సిగరెట్ తాగుతున్నట్లు చూపుతున్న తన రాబోయే డాక్యుమెంటరీ చిత్రం పోస్టర్‌పై వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన బహుళ ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని, రద్దు చేయాలని కోరుతూ చిత్రనిర్మాత లీనా మణిమేకలై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కొద్దిరోజుల క్రితం కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కాళీ డాక్యుమెంటరీ, ప్రమోషనల్ పోస్టర్ లో కాళీ దేవిని అభ్యంతరకరంగా చిత్రీకరించి, ఆపోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ లీనా ఎక్కడ తగ్గడం లేదు.. తాజా సోషల్ మీడియా వేదికగా మరో వివాదానికి తెరలేపింది. ఏకంగా.. ఈసారి సిగరెట్ తాగుతున్న శివపార్వతుల వేషధారుల్లో వున్న వ్యక్తుల ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్…