కొద్దిరోజుల క్రితం కెనడాకు చెందిన భారతీయ సినీ నిర్మాత లీనా మణిమేకలై కాళీ డాక్యుమెంటరీ, ప్రమోషనల్ పోస్టర్ లో కాళీ దేవిని అభ్యంతరకరంగా చిత్రీకరించి, ఆపోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో హిందువుల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ లీనా ఎక్కడ తగ్గడం లేదు.. తాజా సోషల్ మీడియా వేదికగా మరో వివాదానికి తెరలేపింది. ఏకంగా.. ఈసారి సిగరెట్ తాగుతున్న శివపార్వతుల వేషధారుల్లో వున్న వ్యక్తుల ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ.. ఫోటోకి ఇది ఎక్కడో అంటూ ట్వీట్ కూడా జత చేసింది.
తమిళనాడులోని మధురై లో జన్మించిన చిత్రనిర్మాత డైరెక్టర్ లీనా మణి మేకలై ఇప్పటికే కాళి డాక్యుమెంటరీ పోస్టర్ తో వివాదానికి కేంద్ర బిందువుగా మారిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో .. తనను తాను రఓించుకునేందుకు తీసుకున్న చర్యగా పరిగణిస్తున్నారు. ఇప్పటికే లీనా మణిమేకలై తీసిన కాళి డాక్యుమెంటరీ పై దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో అనేక చోట్ల లీనా పై కేసులు కూడా నమోదయ్యాయి. లీనా వివాదాస్పద పోస్టర్ ను తొలగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ లీనా ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో ఇప్పుడు మళ్ళీ చేసిన ఈ పోస్ట్ తో మరింత వివాదం ముదురుతోందనే చెప్పాలి.
Elsewhere…. pic.twitter.com/NGYFETMehj
— Leena Manimekalai (@LeenaManimekali) July 7, 2022