భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు విజయ్ హజారే ట్రోఫీ 2025–26 కలిసిరాలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వికెట్ తీయకపోవడంతో.. అర్జున్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈరోజు ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ కేవలం 8 ఓవర్లలోనే 78 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గోవా తరఫున దర్శన్ మిసాల్, లలిత్ యాదవ్‌లు…