ఘజియాబాద్ పేరు మార్చే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. హర్నంది నగర్, గజ్ ప్రస్థ, దూధేశ్వరనాథ్ నగర్ అనే మూడు పేర్లను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపనున్నట్లు ఘజియాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) మేయర్ సునీతా దయాల్ వెల్లడించారు.