Special Story on Global Recesssion Fears: ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం శరవేగంగా దూసుకొస్తోంది. ఈ మేరకు పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన సంకేతాలు వెలువడకపోయినప్పటికీ ఆర్థిక సంస్థల ప్రతినిధులు మరియు ప్రముఖ ఆర్థికవేత్తలు సూచాయగా కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, జీరో కొవిడ్ పాలసీలో భాగంగా చైనా పాల్పడుతున్న క్రూరమైన చర్యలు, ద్రవ్యోల్బణం మరియు మంకీపాక్స్ కేసులతో స్టాక్ మార్కెట్లలో, ఎకానమీల్లో ఉత్సాహం కరువైంది.