IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
Economic Slowdown In These 3 Countries Will Impact The World In 2023 says IMF: ప్రపంచదేశాలు ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు, అమెరికా, చైనా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఒక్క భారతదేశ ఆర్థిక పరిస్థితి మాత్రమే బాగుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే…
World Bank: ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో, ఆర్థిక మాంద్యానికి చేరువులో ఉందని సాక్షాత్తూ వరల్డ్ బ్యాంకే ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం, రుణాల భారం, వడ్డీ రేట్లు పెరుగుతుండటం అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ పేర్కొన్నారు.