ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ బాలల దినోత్సవాన్ని (చిల్డ్రన్స్ డే) జరుపుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో.. గురువారం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తన కొడుకు ఆకాయ్, కూతురు వామికతో కలిసి బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను దంపతులిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.