చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు గాలిలో వేలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ క్లిప్‌లో చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. భయానక క్లిప్‌లో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనపడుతుంది. నివేదికల ప్రకారం., “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది.…