గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందనే కారణంగా 14 ఏళ్ల బాలికను గ్రామస్తులు చిత్రహింసలకు గురిచేశారు. బాలికకు గుండు కొట్టించి ముఖానికి నల్లరంగు పూశారు. బాలికతోపాటు ఆమె ప్రియుడిని కూడా ఇదే విధంగా శిక్షించి ఊరేగించినట్టు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గం పరువు పోయిందని భావించిన గ్రామస్థులు ఈ చర్యకు దిగినట్టు చెప్పారు. అనంతరం బాలికకు అదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తితో వివాహం చేసినట్లు వెల్లడించారు. Read…