Borewell Incident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.