హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల నియంత్రణకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ సూచించిన సూచనల అమలుకు చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో జీహెచ్ఎంసీ చెత్త ట్రక్కు ఢీకొని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల బాలుడు ఓ ప్రాంతంలో రోడ్డుపై ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బర్త్ సర్టిఫికెట్ల జారీ స్కాం లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆర్డీవో స్థాయి అధికారి అనుమతి లేకుండానే వేల సర్టిఫికెట్లు జారీచేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మీసేవా కేంద్రాల ద్వారా 22,954 సర్టిఫికెట్లు ఆర్డీఓ అనుమతి లేకుండానే జారీ అయ్యాయని గుర్తించారు. 2 వేలకు పైగా డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ కాగా.. మీ సేవ కేంద్రాల ద్వారా 31 వేల నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినట్లుగా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Ghmc: ఇవాల జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాలపై ఆమెదముద్ర లభించింది. అందులో పలు ఎస్ఆర్డీపీ కింద రోడ్డు వెడల్పు కార్యక్రామలకు కమిటి ఆమోదం తెలిపింది. ఎంవోయూలు, టెండర్లకు, పరిపాలన అనుమతులకు కమిటీ ఆమోదం తెలిపింది. ఆమోదం పొందిన అంశాలు.. * కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద శేరిలింగంపల్లి జోన్లో గచ్చిబౌలి నుంచి GPRS క్వార్టర్స్ మీదుగా బ్రహ్మకుమారి సర్కిల్ 20లో గల సెంట్రల్ మీడియన్…
హైదరాబాద్లో వీధికుక్కల దాడిలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కుక్కల దాడిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
Bandi Sanjay Demands KCR Resgination Over Fake Certificates: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ.. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో భాగమని పేర్కొన్నారు. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో పాస్పోర్ట్ పొంది.. ఉగ్రవాదులందరూ పాతబస్తీలో పాగా వేస్తున్నారని వ్యాఖ్యానించారు. పాతబస్తీ ఐఎస్ఐ అడ్డాగా మారిందని అన్నారు. దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా..…
హైదరాబాద్ జీహెచ్ఎంసీకి కుక్కల బెడద ఎక్కువైంది. తమ వీధుల్లో కుక్కలపై ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బల్దియాకు కేవలం 36 గంటల్లోనే 15 వేల ఫిర్యాదులు అందాయి.