బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికలంటే ఎప్పుడూ ఉత్కంఠే. తాజాగా బల్దియా స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లు రసవత్తరంగా మారాయి. మరికొద్ది గంటల్లో ముగియనున్న నామినేషన్ల గడువు ముగియనుంది. చివరిరోజు కావడంతో ఇవాళ 7 నామినేషన్లు వేశారు ఎంఐఎం కార్పొరేటర్లు. ఇప్పటివరకు టిఆర్ఎస్ నుంచి ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అవి కూడా పార్టీ నిర్ణయం మేరకు కాకుండా సొంతంగా వేసినట్లు సమాచారం అందుతోంది. పార్టీ నిర్ణయానుసారం ఇవాళ టీఆర్ఎస్ నుంచి 9 నామినేషన్లు వేయనున్నారు కార్పొరేటర్లు. 15 నామినేషన్లకు…