ఇప్పటి వరకు 107 అక్రమ నిర్మాణాలపై చర్యలు, వాటిలో 84 నిర్మాణాల కూల్చివేత, 23 అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై దాడులు కొనసాగుతున్నాయి.శుక్రవారం నాడు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, హెచ్ఎండిఎ యంత్రాంగం సంయుక్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేత కార్యక్రమాలను నిర్వహించాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నాలుగు(4) అక్రమ నిర్మాణాలను, నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో రెండు(2) అక్రమ నిర్మాణాలను శుక్రవారం…
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూం హౌసింగ్ ప్రాజెక్టు హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులో పూర్తయింది. ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా రూ.1,422.15 కోట్లతో ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ఇందులో 115 బ్లాకులు, 234 లిఫ్టులు ఉన్నాయి. అలాగే ప్లే స్కూల్స్, అంగన్వాడీ సెంటర్లు, ప్రైమరీ, హైస్కూళ్లు, బస్ టెర్మినల్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంకులు, బస్తీ దవాఖానాలు, ఏటీఎంలు, బ్యాంకులు, సైక్లింగ్ ట్రాక్స్…