రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. జిల్లాలోని అనేక ప్రాంతాలతో పాటు.. సిరిసిల్లా టౌన్ లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. పార్క్ చేసిన కార్లు.. పడవలుగా మారిపోయాయి కొట్టుకుపోయాయి.. ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో అయితే.. ముంపులో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నవారు మరికొందరు.. అయితే, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సిరిసిల్లాకు బయల్దేరాయి జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు.. హైదరాబాద్‌లో వరదల సమయంలో.. డీఆర్‌ఎఫ్ బృందాలు చాలా కీలక పాత్ర పోషించాయి..…