ఆరాంఘర్ నుండి నెహ్రూ జూలాజికల్ పార్క్ మార్గంలో 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, నగరంలో రెండవ అతి పొడవైన ఫ్లైఓవర్ మార్చి 2023 నాటికి ప్రారంభించబడే అవకాశం ఉంది. ప్రస్తుతం పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే నగరంలో పొడవైన ఫ్లైఓవర్. 636.80 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద ఆరు లేన్‌ల ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్ పనులను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పరిశీలించారు.…