తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్, ఇప్పుడు ‘ఆర్యన్’ అనే ఉత్కంఠభరితమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా, మేకర్స్ ఈ చిత్రం నుండి ‘ఐయామ్ ది గాయ్’ అనే పాటను విడుదల చేశారు.…