Disha Patani: బాలీవుడ్ నటి దిశాపటానీ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) మంగళవారం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బరేలిలోని దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దర్ని అధికారులు కాల్చి చంపారు. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర అలియాస్ కల్లు, హర్యానాలోని సోనిపట్ నివాసి అరుణ్‌లుగా గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్…