జర్మనీ విమానయాన సంస్థ లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను ప్యాసింజర్, కార్గో విమానాలను రద్దు చేసింది. పైలట్ల సమ్మె కారణంగా ఈ రోజు ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ విమానాశ్రయాలకు వెళ్లే, బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. ఇది 130,000 మంది ప్రయాణికులపై ప్రభావం చూపుతుందని గురువారం లుఫ్తాన్సా గ్రూప్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.