ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్‌డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . "కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ" అని పేర్కొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉన్నత స్థాయి ద్రోహిగా అభివర్ణించారు. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన ముక్కోణపు బంధం గురించి మాట్లాడబోతున్నామని బీజేపీ నేత అన్నారు
విదేశాంగ మంత్రి జైశంకర్ డిన్నర్ చేయాల్సి వస్తే జార్జ్ సోరోస్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లలో ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నిస్తే, జైశంకర్ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
S Jaishankar: విదేశీ బిలియనీర్ జార్జ్ సోరోస్ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ఆయన వ్యాఖ్యలపై మండిపడుతోంది. నిన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జార్జ్ సోరోస్ పై విమర్శలు గుప్పించారు. ముసలివాడు, ధనవంతుడు, అతని అభిప్రాయాలు ప్రమాదకరమైనవి అంటూ మూడు ముక్కల్లో జార్జ్ సోరోస్ ను అభివర్ణించాడు. మొత్తం ప్రపంచం ఎలా పనిచేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని…