కరోనాతో ఆగిపోయిన రైళ్లలో జనరల్ టిక్కెట్లను తిరిగి దశల వారీగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే చాలా రైళ్లలో కరోనా కారణంగా జనరల్ టిక్కెట్లను ప్రభుత్వం నిలిపివేసింది. కరోనా అనంతరం చాలా రైళ్లు తిరిగి ప్రారంభం అయినా కేవలం రిజర్వేషన్ టిక్కెట్ సౌకర్యం మాత్రమే రైల్వే శాఖ కల్పించింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు సొంత వాహనాలు, లేదా బస్సులను ఆశ్రయించారు. అయితే తాజాగా కొన్ని…