Imran Khan: పాకిస్తాన్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోందని మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆసిమ్ మునీర్‌కి ఇటీవల పాక్ ప్రభుత్వం ‘‘ఫీల్డ్ మార్షల్’’ పదవితో సత్కరించింది. యుద్ధంలో అసాధారణ వ్యూహాలు, సైనిక విజయాలు సాధించిన వారికి ఈ ప్రమోషన్ లభిస్తుంది. అసిమ్ మునీర్ ఫీల్డ్ మార్షల్‌కు బదులుగా తనను తాను "రాజు" అనే బిరుదును ఇచ్చుకోవాల్సిందని ఇమ్రాన్ ఖాన్ ఎద్దేవా…