బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో బిగ్‌బాస్ షోతో అలరించిన తారక్.. ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా అభిమానులకు వినోదాన్ని అందిస్తున్నాడు. సీజన్ 1కు సంబంధించి నిర్వాహకులు మొత్తం 60 ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 ఎపిసోడ్లు టీవీలో టెలీకాస్ట్ అయ్యాయి. మరో 23 షోలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. సీజన్ 1 మొత్తానికి…
వరుస పరాజయాలతో ఎంతో కాలంగా ప్రయాణం చేస్తున్న ‘అల్లరి’ నరేశ్ కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది ‘నాంది’ చిత్రం. ఈ కోర్ట్ డ్రామా విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు… సాధారణ ప్రేక్షకుడిలోనూ ఓ ఉత్సుకతను కలిగించింది. నటుడిగా నరేశ్ ను మరో మెట్టు పైన నిలిపింది. థియేటర్లలోనే కాకుండా ఆ తర్వాత ఆహా లో స్ట్రీమింగ్ అయినప్పుడు కూడా అదే ఆదరణ ఈ చిత్రానికి లభించింది. ఇక ఇప్పుడు ఈ నెల 30న ఈ సినిమాను జెమినీ…