గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
Mass Shooting : గాజాకు సాయంపై నిషేధం విధించిన తర్వాత పాలస్తీనియన్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. గురువారం సాయం కోసం ఎదురుచూస్తున్న పౌరులపై ఇజ్రాయెల్ ఆర్మీ బహిరంగ కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.