Israel-Pakistan: బయటకు ఇజ్రాయిల్ అంతే శత్రుదేశంగా భావించే పాకిస్తాన్, తెర వెనక మాత్రం ఇజ్రాయిల్ స్నేహాన్ని కోరుకుంటోంది. ఇటీవల, ఇజ్రాయిల్-హమాస్ మధ్య గాజా శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్‌లో తెహ్రీక్ ఏ లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్‌పీ) పెద్ద ఎత్తున ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళల్ని నిర్వహించింది. దీనిని పాక్ ఆర్మీ, పోలీసులు కఠినంగా అణిచివేశారు. సొంత ప్రజలపైనే కాల్పులు జరిపారు. ఈ అల్లర్లలో పలువురు మరణించారు.