ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. ధోనీ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలకు మాత్రం ఫుల్‌స్టాప్ ఉండదు. అంతర్జాతీయ క్రికెట్‌కు చాలా సులభంగానే వీడ్కోలు పలికేసిన ధోనీ ఐపీఎల్ కు మాత్రం అంత త్వరగా దూరం కాలేకపోతున్నాడు. వయసు 43 దాటేసినా, ఆరోగ్యం సహకరించకపోయినా ఐపీఎల్ ఆడేందుకే మొగ్గు చూపుతున్నాడు. ధోనీకిదే చివరి సీజన్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. ధోనీ…