Gautam Gambhir: భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మరోసారి మాజీ క్రికెటర్స్ సీరియస్ అవుతున్నారు. టీమిండియా ఓటమికి కారణం గంభీర్ నిర్ణయాలే అంటూ మండిపడుతున్నారు.
టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్‌గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్…