Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను!
- టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సక్సెస్
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025 విజయాలు
- నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాక ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత జట్టు గెలుచుకుంది. కుర్రాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను సైతం డ్రాగా ముగించాడు. అయితే కోచ్‌గా వచ్చిన కొత్తలో గౌతీ వరుస పరాజయాలు చవిచూశాడు. అందులో ముఖ్యమైంది ఏంటంటే… భారత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం. ఈ సిరీస్ ఫలితంపై గంభీర్ తాజాగా స్పందించాడు. తన జీవితాంతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను అని చెప్పాడు.
ఢిల్లీలో వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో గౌతమ్ గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ‘స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమిని నా జీవితాంతం మర్చిపోలేను. ఇదే విషయాన్ని భారత జట్టు కుర్రాళ్లకూ చెప్పాను. ఆ ఓటమిని వదిలేసి ముందుకు సాగాలి. అయితే గతాన్ని కూడా మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. గతాన్ని మర్చిపోతే.. దేనినైనా తేలికగా తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆటలో గెలుపు, ఓటమీ సహజమే. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లకు ఎప్పుడూ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఏం జరిగిందో వివరిస్తుంటా. ప్రత్యర్థికి అస్సలు అవకాశం ఇవ్వకూడదదని నేను అనుకుంటా’ అని గంభీర్ తెలిపాడు.
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
Also Read: Sai Sudharsan Catch: సాయి సుదర్శన్ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!
‘ప్రపంచంలోనే నంబర్ 1 జట్టుగా మారాలనుకుంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. విదేశాల్లోనూ విజయాలు సాదించాలి. ప్రస్తుతం ఉన్న యువ జట్టు అదే చేస్తోంది. ఇంగ్లాండ్ అత్యంత కఠినమైన సవాల్ విసిరే టీమ్. అందులోనూ వారి సొంతగడ్డపై అత్యంత ప్రమాదకారి. ఇంగ్లాండ్‌కు పెద్దగా అనుభవం లేని జట్టుతో వెళ్లాం. మన ప్లేయర్స్ అద్భుతమైన ప్రదర్శన చేశారు. కేవలం ఫలితం మాత్రమే చూడకూడదు, ఎలాంటి పోరాటం చేశామనేది కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. కేవలం మన దగ్గరే విజయాలు సాధిస్తే ఛాంపియన్‌షిప్ విజేతగా నిలవలేం’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!