వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా దానిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లి తొక్కలను మీరు పనికిరావని భావించి పారేస్తున్నారా.. ఇక నుంచి తెలుసుకోండి వెల్లుల్లి లాగానే వెల్లుల్లి తొక్కలతో కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని సూప్‌లు, కూరగాయలలో వాడవచ్చు. వెల్లుల్లి తొక్కల వల్ల ఉబ్బసం, పాదాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి.…