కరోనా కాలంలో పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరుగుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ఎలాంటి సందడి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ పెళ్లి పూలదండ కారణంగా ఆగిపోయింది. వివాహం సమయంలో వధూవరులు దండలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వరుడు దండను వధువు మెడలో వెయకుండా విసిరేసినట్టుగా వేశాడు. దీనిపై పెళ్లికూతురు అభ్యంతరం చెప్పింది. ఇరు వర్గాలకు చెందిన బంధువులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వధువు తగ్గలేదు.. దండను విసిరేయడం నచ్చలేదని,తనకు ఆ పెళ్లి వద్దని…